ఆకాశమా ఆలకించుమా మాటలాడెదన్
Aakaashamaa Aalakinchumaa Maatalaadedan
Original lyrics
ఆకాశమా ఆలకించుమా - మాటలాడెదన్ (2)
యెహోవా వంతు ఆయన జనమేగదా
యాకోబే స్వాస్థ్యభాగము (2)
1. అరణ్య ప్రదేశంబుల యందున (2)
భీకర ధ్వనిగల యెడారిలో
వాని కనుగొనెను (2)
ఆవరించి వాని పరామర్శించి
గాచె కనుపాపగా (2) ||ఆకాశమా||
2. యెహోవాయే వాని నడిపించెను (2)
భూమి యొక్క ఉన్నతస్థలముల
మీద వాని నెక్కించి (2)
అన్య దేవతలతో నేదైనను
లేకపోయె వానిలో (2) ||ఆకాశమా||
3. లేచి వెళ్ళుమనే బేతేలునకు
దేవునికి బలిపీఠమచ్చట
కట్టుమని సెలవియ్యగా
అన్యదేవతల పారవేయుమని
తనవారితో చెప్పెన్ (2) ||ఆకాశమా||
4. తిరిగి బేతేలులో దర్శన మిచ్చెను
దీవించి నీ పేరు ఇశ్రాయేలుగా
నెల్లప్పుడుండుననెను
తన యింటికి వచ్చువారి నెల్ల
ప్రభు దీవించు నీరీతిన్ (2) ||ఆకాశమా||
5. ప్రభుని రాకడ సమీపమంచును
సమాజముగా కూడుట మరువక
మరియు మీరు మానక
ప్రభుని యింటి దీవెన లెల్ల
పొందుడి నిక్కముగా (2) ||ఆకాశమా||
Romanised English lyrics
Aakaashamaa Aalakinchumaa - Maatalaadedan (2)
Yehovaa Vanthu Aayana Janamegadaa
Yaakobe Svaasthyabhaagamu (2)
1. Aranya Pradesambulu Yanduna (2)
Bheekara Dhvanigala Yedaarilo
Vaani Kanugonenu (2)
Aavarinchi Vaani Paraamarshinchi
Gaache Kanupaapagaa (2) ||Aakaashamaa||
2. Yehovaaye Vaani Nadipinchenu (2)
Bhoomi Yokka Unnathasthalamula
Meeda Vaani Nekkinchi (2)
Anya Devathalatho Nedainanu
Lekapoye Vaanilo (2) ||Aakaashamaa||
3. Lechi Vellumane Bethelunaku
Devuniki Balipeethamachchata
Kattumani Selaviyyagaa
Anya Devathala Paaraveyumani
Thanavaaritho Cheppen (2) ||Aakaashamaa||
4. Thirigi Bethelulo Darshanam Ichchenu
Deevinchi Nee Peru Ishraayelugaa
Nellappudundunanenu
Thana Yintiki Vachchuvaari Nella
Prabhu Deevinchu Neereethin (2) ||Aakaashamaa||
5. Prabhuni Raakada Sameepamanchunu
Samaajamugaa Kooduta Maruvaka
Mariyu Meeru Maanaka
Prabhuni Yinti Deevenalella
Pondudi Nikkamugaa (2) ||Aakaashamaa||