OsannaOpen app

ఆనందముగా యెహోవా నీ

తెలుగు#527

Aanandamugaa Yehovaa Nee

Original lyrics

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) 1. చావు గోతినుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవ దాత వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| 2. సింహపు పిల్లలు – ఆకలిగొనిన యెహోవా సహాయుడందరికి ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| 3. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| 4. పర్వతంబులు – పారిపోయినను ఉర్విలో మార్పు కలిగిననూ తరుణములు విరోధముగపై లేచినా స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||
Romanised English lyrics
Aanandamugaa Yehovaa Nee Krupaalanni Anni Kaalambulandu Keerthinchedan (2) 1. Chaavu Gothinundi Levaneththi Naaku Jeevamichchina Jeeva Daatha Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo Savyambugaa Ee Bhuviyanduna ||Aanandamugaa|| 2. Simhapu Pillalu – Aakaligonina Yehovaa Sahaayudandariki Ihamandunaa Ae Melu Koduva Yundadu Aaha! Emandu Nee Vishwaasyathan ||Aanandamugaa|| 3. Ennenno Shodhana Baadhalu Regi Nannu Krungadeeya Poraadinan Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina Kanna Thandri Ninnu Koniyaadedan ||Aanandamugaa|| 4. Parvathambulu – Paaripoyinanu Urvilo Maarpu Kaliginanoo Tharunamulu Virodhamuga Pai Lechinaa- Smariyincheda Nee Vishwasyathan ||Aanandamugaa||
Open in app · save or share