OsannaOpen app

ఆర్భాటముతో

తెలుగు#551

Aarbhaatamutho

Original lyrics

ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మహిమలో ప్రభువు తన స్వాస్థ్యముకై త్వరగా రానై యున్నాడు అరుదెంచెను నవవసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని ఘడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపికకలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే ||ఆర్భా|| పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము సూర్యచంద్రులు అక్కరలేని సీయోను నగరమునందు గొర్రెపిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము ||ఆర్భా|| వధువుసంఘముగ ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణప్రియునితో లీనమైపోదుము ||ఆర్భా||
Romanised English lyrics
Aarbhaatamutho Pradhaana Dootha Shabdamutho Devuni Booratho Mahimalo Prabhuvu Thana Svaasthyamukai Thvaragaa Raanai Yunnaadu Arudenchenu Navavasanthamu Chigurinchuchunnadi Anjooramu Anukonani Ghadiyalo Prathyakshamagunu Meghaalapai Mana Priyudu Opikakaligi Aathma Phalamunu Phalinchedamu Prabhu Korake ||Aarbhaa|| Parishuddhathalo Sampoornulamai Prabhuvu Vale Maarpunondedamu Sooryachandrulu Akkaraleni Seeyonu Nagaramunandu Gorrepilla Deepakaanthilo Prakaashinchedamu ||Aarbhaa|| Vadhuvusangghamuga Prabhuvutho Kalisi Nithyamu Nivaasamundedamu Aahaa Entho Sogasaina Vaibhavamaina Pannendu Gummamula Nagaramulo Yugayugaalu Mana Praanapriyunitho Leenamaipodumu ||Aarbhaa||
Open in app · save or share